Home

ప్ర‌జా నాయకుడు.. అంటే చక్కని పరిపాలనా దక్షత కలిగి, సన్మార్గంలో నడిపే వాడు.. తన కార్యకర్తలను ప్రభావితం చేయగలవాడు.. తనతోటి నడిచే వారిని మంచి పనులు చేయటానికి ప్రభావితం చేయటం, మంచి మనిషిగా జీవించేలా చేయటం, కష్టపడి పనిచేసి గమ్యాన్ని చేరేలా తన శ్రేణుల్ని ఉత్తేజ పరచటం..” అదీ నాయకత్వ లక్షణం.. నాయకుడు అనేవాడు గొప్ప నమ్మకస్తుడిగా వుండాలి. అలాంటి ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్న ఈ త‌రం నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్.
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్. ఏఐసీసీ స‌భ్యుడు, నల్గొండ ఉమ్మ‌డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం పారుపల్లి గ్రామం ఆయ‌న సొంతూరు. తండ్రి సోమయ్య, తల్లి స‌త్త‌మ్మ‌. భార్య బి.సువర్ణ, కుమారుడు, కూతురు ఉన్నారు. బిక్షమయ్య  మాస్ట‌ర్ ఆప్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (MBA ) చదివారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ రాష్ట్రంలో మాస్ లీడ‌ర్‌గా పేరున్న బూడిద‌ బిక్షమయ్యకు పేదల పెన్నిదిగా పేరుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను అర్థం చేసుకుని వాటిని తీర్చేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటారు. చిన్న‌ప్ప‌టి నుంచే కాంగ్రెస్ విధానాల ప‌ట్ల ఆక‌ర్షితుడై, యూత్ కాంగ్రెస్, NSUI కు ద‌గ్గ‌ర‌య్యారు.
ఉమ్మ‌డి న‌ల్గొండ, ప్ర‌స్తుతం యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం అంతటా బిక్ష‌మ‌య్య‌కు మంచి సంబంధాలు, పేద‌ ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు ఉండ‌టంతో 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసిన ఘ‌న‌త బిక్ష‌మ‌య్యకే ద‌క్కుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. నీటి క‌ట‌క‌ట ఉన్న‌ గ్రామాలకు తాగునీరు అందించారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ నిర్మూల‌న కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చారు, మెప్పు పొందారు. నియోజ‌క‌వర్గంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మంచి సంబంధాలు ఉన్న బిక్ష‌మ‌య్య కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య‌ల వ‌చ్చినా నేనున్నా అంటూ ఆదుకుంటారు.
2014 ఎన్నికల తర్వాత, క్యాడర్ ధైర్యాన్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కాంగ్రెస్ అనే కార్య‌క్ర‌మ‌లో ఊరూరా, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతూ ప్ర‌జ‌ల‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుస్తూ వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు, స‌క్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అల‌స‌త్వాన్ని ఎండ‌గ‌ట్ట‌డం, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూప‌డంలో బిక్ష‌మ‌య్య విజ‌య‌వంతం అయ్యారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సార‌థ్యంలో ఆయ‌న మ‌ద్ద‌తుతో బిక్ష‌మ‌య్య పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డారు.